ముడుపుల కోసమే పట్టిసీమః వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్ః పట్టిసీమ పేరుతో వందలకోట్లు దండుకొని చేసిన ప్రారంభోత్సవాన్నే మళ్లీ  మళ్లీ చేస్తూ బాబు రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెడుతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లు బాబు వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరందిస్తామని అబద్ధపు ప్రచారం చేసిన చంద్రబాబు...సీమకు కాదు కదా కనీసం కృష్ణా డెల్టాకు కూడా చుక్క నీరిచ్చిన దిక్కులేదని ధ్వజమెత్తారు.  24 పంపుల ద్వారా నీళ్లు ఇస్తున్నామంటూ కెమెరాల ముందు ఫోజులిస్తూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారు తప్పితే బాబు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ముడుపుల కోసం మమ అనిపించడానికే బాబు ముచ్చటగా మూడోసారి పట్టిసీమ ప్రారంభోత్సవం చేశారని నిప్పులు చెరిగారు.

Back to Top