హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2012: ఏమాత్రం తమను పట్టించుకోని సర్కారు అలక్ష్య వైఖరిపై.. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డితో పాటు అసువులు బాసిన వైఎస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.సరిగ్గా మూడు వారాల కిందటే భర్తను కోల్పోయి.. ఆ బాధను ఏమాత్రం తొలగకముందే, తనను కళ్లలో పెట్టి చూసుకునే కన్నబిడ్డను కోల్పోతే కలిగే గుండెకోతను వర్ణించడానికి మాటలు చాలవు. కన్నబిడ్డలిద్దరికి టాటాచెప్పి విధి నిర్వహణకు వెళ్లిన భర్త ప్రమాదంలో మరణించాడన్న వార్తను జీర్ణించుకోవడం ఆ ఇంటి ఇల్లాలికి సాధ్యమయ్యే పనేనా ?దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన వెస్లీ కుటుంబసభ్యులకు ఈ పరిస్థితి ఎదురయింది.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెస్లీ కుటుంబానికి అందించాల్సిన సాయం విషయంలో కూడా సర్కారు చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆ కుటుంబసభ్యులు వివరిస్తూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు.