పాతపట్నంలో సమస్యల వెల్లువ

జననేతకు బాధలు వివరిస్తున్న ప్రజలు


అందరికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైయస్‌ జగన్‌

శ్రీకాకుళం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మోసపోయాం.. మా బతుకులు మీవల్లే బాగుపడుతాయంటూ ఊరూవాడ ఏకమై ముక్తకంఠంతో చెబుతున్నాయి. ప్రజా సమస్యలు తెలుసుకొని, చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. శ్రీకాకుళం ప్రజలు హారతులు పడుతూ జననేతకు స్వాగతం పలుకుతున్నారు. వారి సమస్యలను వైయస్‌ జగన్‌కు వివరిస్తున్నారు. మరోసారి చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయేది లేదని తేల్చిచెబుతున్నారు. 330వ రోజు పాతపట్నం నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు వెల్లువలా మద్దతు వస్తుంది. జననేతను చూసేందుకు, సమస్యలు చెప్పేందుకు వేలాదిగా జనం తరలివస్తున్నారు.
కాల్వ దిశ మార్చండి
ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జోడూరు గ్రామస్తులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వంశధార, బహుదా నది అనుసంధాన కాల్వ దిశ మార్చాలని కోరారు. ఈ విషయంపై జననేత సానుకూలంగా స్పందించారు.
తాగునీరు లేక ఇబ్బందులు..
తాగునీరు లేక అవస్థలు పడుతున్నామని ముకుందాపురం మహిళలు వైయస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యను చెప్పుకున్నారు. గ్రామంలో తాగునీటి సరఫరా నిలిపివేశారని, రోడ్డు సౌకర్యం లేదని వివరించారు. అదే విధంగా చింతలపోలూరు గ్రామస్తులు కలిసి తమ గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అధికారంలోకి రాగానే అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
మినీ ఐటీడీఏ నిర్మించండి..
మెళియాపుట్టి మండల కేంద్రంలో మినీ ఐటీడీఏ నిర్మించాలని ఆదివాసీలు వైయస్‌ జగన్‌ను కలిసి కోరారు.  ఐటీడీఏ ద్వారా గిరిజన స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించాలని, పోడు వ్యవసాయానికి బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలని జగన్‌ను కోరారు.

Back to Top