చ‌దువే అభివృద్ధికి మార్గం

గుంటూరు రూరల్ : చ‌దువుతో స‌త్ప్ర‌వ‌ర్త‌న వ‌స్తుంద‌ని, అదే అభివృద్ధికి మార్గం అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. బుధవారం మండలంలోని నల్లపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున సరస్వతి దేవి పూజలో పూజలందుకున్న కంకణాలు, పెన్నులు, పుస్తకాలు శ్రీ అగస్తేశ్వరాలయం భక్త బృదం ఆధ్వ‌ర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ సంద‌ర్భంగా సుచరిత మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే నైపుణ్య‌త‌ల‌తో కూడిన విద్య ఎంతో అవసరమన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి అటు తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. శ్రద్దతో కృషిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు పవన్కుమార్శర్మా, గ్రామ వైయ‌స్ఆర్ సీపీ కన్వీనర్ దుగ్గెంపూడి యోగేశ్వ‌ర‌రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జిలాని త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top