స్థానిక ఎన్నికల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ 10 జూలై 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు  స్థానిక ఎన్నికలను పర్యవేక్షించేందుకు పార్టీ నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. పదిమంది సభ్యులున్న ఈ కమిటీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్త ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తుంది. కమిటీ సభ్యులుగా డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, వైయస్.వివేకానందరెడ్డి, ఇందుకూరి రామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, చందా లింగయ్య దొర, గాదె నిరంజన్‌రెడ్డి, పరంజ్యోతి, ఆరిమండ వరప్రసాదరెడ్డిలను నియమించారు.

Back to Top