22న విజయవాడలో పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర సదస్సు

గాంధీనగర్‌: ఈనెల 22న వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర సదస్సు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రచార విభాగం నగర అధ్యక్షుడు పోతిరెడ్డి సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సదస్సులో ముఖ్య నాయకులు పాల్గొంటారన్నారు. చంద్రబాబు తన మూడేళ్ల పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. అవినీతి, బంధుప్రీతి పెరిగిందన్నారు. అధికారపార్టీ నాయకులు ఇష్టానుసారం దోచుకుంటున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రచార విభాగంపై ఉందన్నారు. టీడీపీ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు. వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు  జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో రాష్ట్రానికి, పేదలకు జరిగే మేలును వివరిస్తామన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి చంద్రబాబును గద్దెదింపే వరకు ప్రచార విభాగం శ్రమిస్తుందన్నారు. పార్టీ ప్రచార విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని, అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 22న జరిగే సదస్సులో 13జిల్లాలకు చెందిన ప్రచార విభాగం ప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రచార విభాగం నగర ప్రధాన కార్యదర్శులు సొంగా చందన్, తాడి శివ, కార్యదర్శులు మద్దిరాల పోలిరెడ్డి, కె శివ, యానాల వెంకటేశ్వరరావు, ఎం వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top