పరిటాల నియోజకవర్గంలో షర్మిలకు బ్రహ్మరథం

రాప్తాడు:

మహానేత తనయ వైయస్ షర్మిలకు తమ ఇబ్బందులను చెప్పుకోవడానికి రాప్తాడు నియోజకవర్గ ప్రజలు వెల్లువెత్తారు. మంగళవారం మధ్యాహ్నం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. తొలుత పాఠశాల విద్యార్థులు ఆమెకు స్వాగతం పలికారు. కరచాలనాలు చేయడానికి పోటీలు పడ్డారు. అక్కా.. మా సమస్య ఇది.. విను అంటూ ముందుకొచ్చారు. అదే సందర్భంలో షర్మిల కూడా తమ సమస్యలను ఎవరికి వారు చెప్పుకునేలా చూశారు. పిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. వేల సంఖ్యలో హాజరైన ప్రజలు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. సందర్భానికి అనుగుణంగా, ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె చేసిన ప్రసంగాలకు ప్రజలు అడుగడుగునా హర్షధ్వానాలు పలికారు. చేనేతలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు.. వారికి మహానేత ఏం చేయాలని అనుకున్నారు.. ఏం చేశారు... జగన్ ఏం చేయనున్నారు అనే అంశాలను విడమరిచి చెప్పారు.

Back to Top