పర్చూరు సమన్వయకర్త గొట్టిపాటి కన్నుమూత

హైదరాబాద్, 7 డిసెంబర్ 2013 :

మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పర్చూరు నియోజకవర్గం సమన్వయకర్త గొట్టిపాటి నరసయ్య (51) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు‌ జామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు. నరసయ్య స్వగ్రామం ప్రకాశం జిల్లా యద్దనపూడిలో ఆదివారంనాడు అంత్యక్రియలు జరుగుతాయి.
గొట్టిపాటి నరసయ్య 1997 ఉప ఎన్నికల్లో, 1999 ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నరసయ్య తండ్రి గొట్టిపాటి హనుమంతరావు సీనియర్ రాజకీయవేత్తగా, మంత్రిగా పనిచేశారు. తండ్రి మరణానంతరం‌ నరసయ్య 97 ఉపఎన్నికల్లో గెలిచారు.

తాజా వీడియోలు

Back to Top