పలమనేరులో వచ్చే నెల విజయమ్మ సభ

పలమనేరు:

పలమనేరులో డిసెంబర్ 5న జరగనున్న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, వైఎస్సార్ సీపీ యువనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కోరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఈ సభలో పాల్గొంటారని తెలిపారు. ఇదే సభలో తాను పార్టీలో చేరతానని అమరనాథరెడ్డి చెప్పారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ అమరనాథరెడ్డి చేరికతో పార్టీకి బలం మరింత చేకూరిందన్నారు.

Back to Top