పేదల పక్షపాతి వైయస్ఆర్: సుబ్రహ్మణ్యం రెడ్డి

శాంతిపురం:

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పేదల పక్షపాతి అని నియోజకవర్గ ఇన్‌చార్జి, జెడ్పీ మాజీ చైర్మన్ ఎం. సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని సోగడబళ్ల గ్రామంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకునేందుకు వైయస్ఆర్ పాదయాత్ర చేశారని అన్నారు. పాదయాత్ర అనుభవ ఫలితంగానే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు అందకుండా చేస్తోందన్నారు.  వైయస్ఆర్ స్వర్ణయుగాన్ని మళ్లీ చూడాలంటే ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. మండలంలోని సోగడబళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ముఖ్యుల్లో గ్రామపెద్ద నరసింహులు, చెంగప్ప, భాస్కర్, మంజునాథ్, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, అల్లాబాషా, అబ్దుల్లా, ఇనాయతుల్లా, అమీర్‌జాన్, వెంకటేపల్లెకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గౌనివారి శివరాం తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన వారికి సుబ్రమణ్యంరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు సర్ఫరాజ్, స్థానిక ప్రముఖుడు వెంకటస్వామి, పార్టీ మండల కన్వీనర్ రఘురామిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు ఏవీ జయరాం, యువజన విభాగం మండల అధ్యక్షుడు గంగాధరం, మైనారిటీ అధ్యక్షుడు నిస్సార్, స్థానికులు చంద్రబాబునాయుడు, అప్పి, కోదండరెడ్డి, కేశవరెడ్డి, చలపతి, రమేష్, చంద్రారెడ్డి పాల్గొన్నారు.

Back to Top