పీ ఏ సీ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్ రెడ్డి

హైదరాబాద్) ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్ గా డోన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని శాసనసభ
ప్రాంగణంలో ఛార్జ్ తీసుకొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
సాంప్రదాయం ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుడ ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ గా
వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ని ప్రతిపక్ష నేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎంపిక చేశారు. దీంతో ఆయన శాసనసభ లో బాధ్యతలు
స్వీకరించారు. అనంతరం మొదటి సమావేశాన్ని రాజేంద్రనాథ్ రెడ్డి నిర్వహించారు.

To read this article in English:  http://bit.ly/1VQliyU


Back to Top