పాతపల్నాడులో నేడు షర్మిల బహిరంగ సభ

గుంటూరు : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగన్మహన్‌రెడ్డి సోదరి‌ శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం నరసరావుపేట నియోజకవర్గంలో సాగుతుందని పార్టీ‌ గుంటూరు జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, పార్టీ ‌కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. పాతపల్నాడు బస్‌స్టాండ్‌ వద్ద ఈ రోజు శ్రీమతి షర్మిల బహిరంగ సభలో ప్రసంగిస్తారని వారు ప్రకటించారు.

మంగళవారం రాత్రికి బసచేసిన గోళ్లపాడు గ్రామం శివారు నుంచి శ్రీమతి షర్మిల బుధవారం ఉదయం బయలుదేరి నరసరావుపేట మండలంలోని ములకలూరు, ఇసప్పాలెం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నరసరావుపేట పట్టణం బైపాస్‌రోడ్ మీదుగా బరంపేట, పెద్దచెరువు సెంటర్, పల్నాడురోడ్ మీదుగా పాతపల్నాడు బస్టాండుకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం గుంటూరు రో‌డ్, క్రిస్టియ‌న్‌పాలెం మీదుగా బుధవారం రాత్రి బసకు శ్రీమతి షర్మిల చేరుకుంటారు.

కాగా, మంగళవారంనాడు శ్రీమతి షర్మిల మొత్తం 12.6 కిలోమీటర్లు నడిచారు. మంగళవారం 82వ రోజు పాదయాత్ర ముగిసే సమయానికి మొత్తం 1,139.6 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తిచేశారు.
Back to Top