పార్టీ బలోపేతానికి కృషి చేయండి

అమలాపురం:

పార్టీ బలోపేతమే లక్ష్యంగా అనుబంధ కమిటీలు పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి సూచించారు. అమలాపురంలో పార్టీ అనుబంధ విభాగాల జిల్లా కన్వీనర్లతో  ప్రత్యేక సమావేశంలో చిట్టబ్బాయి మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై పలువురు నేతలు సలహాలు, సూచనలు చేశారు. ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టి.కె. విశ్వేశ్వరరెడ్డి, పార్టీ అనుబంధ కమిటీల కన్వీనర్లు అనంత ఉదభాస్కర్, కర్రి పాపారాయుడు, గుత్తుల రమణ, రొంగలి లక్ష్మి, మట్టపర్తి మురళీకృష్ణ, పంపన రామకృష్ణ, రావూరి వెంకటేశ్వరరావు, గారపాటి ఆనంద్, మార్గాని గంగాధర్, రాజమండ్రి యువజన విభాగం కన్వీనర్ గుర్రం గౌతమ్, అమలాపురం వాణిజ్య విభాగం కన్వీనర్ గనిశెట్టి రమణ్ లాల్, సేవాదళ్ పట్టణ కన్వీనర్ తోరం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీమతి షర్మిల పాదయాత్రలో జ్యోతుల


     ప్రజా ప్రస్థానం పేరుతో వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రలో  పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో శ్రీమతి షర్మిల వెంట నడిచిన ఆయన స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమతి షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. పాదయాత్రలో జ్యోతుల నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top