పార్ణపల్లి : మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా పార్ణపల్లికి వచ్చిన మహానేత వైయస్ఆర్ కుమార్తె షర్మిలకు మంగళవారం ఘన స్వాగతం లభించింది. ఆమెకు స్వాగతం పలికేందుకు ఊరంతా కదిలి వచ్చింది. కోలాటాలు, వాయిద్యాలు, ఈటెలు, చిడతలు పట్టిన చిన్నారులతో ఊరంతా పండగ వాతావరణం కనిపించింది. మంగళవాయిద్యాలు, బ్యాండు మేళాలతో ఊరంతా ఒక్కటిగా వచ్చిన షర్మిలకు స్వాగతం పలికింది. ఊళ్లో మిద్దెలు, మేడలన్నీ ఆమెను చూసేందుకు వచ్చిన వారితో కళకళలాడాయి. ఈ సందర్భంగా షర్మిల గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు.