‘పార్లమెంటరీ సాంప్రదాయాలు తెలియని రేవంత్’

హైదరాబాద్, 20
నవంబర్ 2012: పార్లమెంటరీ సంప్రదాయాలు తెలుసుకోకుండా టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి
అజ్ఞానిలా మాట్లాడుతున్నారని ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు ఎద్దేవా చేశారు.
యుపిఎ ప్రభుత్వానికి అసలు మద్దతే తెలపని వైయస్ఆర్ 
కాంగ్రెస్ పార్టీని మద్దతు ఉపసంహరించుకోవాలంటూ రేవంత్  ఏ విధంగా కోరతారని ఆయన నిలదీశారు. కేంద్రంలోని యుపిఎ
ప్రభుత్వానికి వైయస్ఆర్ సిపి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ రేవంత్ రెడ్డి సోమవారం డిమాండ్
చేయడంపై గోనె తీవ్రంగా స్పందించారు. నోరు ఉంది కదా అని రేవంత్ అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని
గోనె నిప్పులు చెరిగారు. పార్టీ నుండి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు టిడిపి
ఎందుకు ఫిర్యాదు చేయడంలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తే తమ పార్టీకి
డిపాజిట్లు కూడా రావన్న భయం టిడిపికి పట్టుకుందని ఆయన ఆరోపించారు.

Back to Top