పాదయాత్రలపై పేటెంట్ వైయస్ కుటుంబానిదే

ఇడుపులపాయ:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు శనివారం నాడు కడప జిల్లా ఇడుపులపాయలో సమావేశమయ్యారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఈ నెల 18నుంచి చేపట్టనున్న పాదయాత్ర స్వరూప స్వభావాలపై వారు చర్చించనున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనే ఈ యాత్రకు చేపట్టాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యల గురించి కూడా వారు చర్చిస్తారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు కురిపించారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలనే స్వార్థ చింతనతో బాబు పాద యాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్ మరణం తర్వాత  ప్రజలను రాబందుల్లా దోచుకు తింటున్నాని ఆరోపించారు. ప్రజల సమస్యలను తెలుసుకుందుకే షర్మిల ప్రసాప్రస్థానం చేపడుతున్నారన్నారు. పాదయాత్రలపై పేటెంట్ రైట్ వైయస్ కుటుంబ సభ్యులకే ఉందని ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత చరిత్రలో షర్మిలకే దక్కుతుందన్నారు. పాదయాత్ర ప్రారంభం రోజున ఇడుపులపాయలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటవుతుందని భూమన వెల్లడించారు. మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Back to Top