పాదయాత్రలో పాల్గొన్న కువైట్ ప్రవాసాంధ్రులు

అనంతపురం:

షర్మిల పాదయాత్రకు ప్రవాస భారతీయులు మద్దతు తెలిపారు. కువైట్ నుంచి అనంపురం వచ్చిన బీహెచ్. ఇలియాస్, ఎంవీ నరసారెడ్డి, కడప శీను, శీలం రాజా, రమణాయాదవ్, గోవింద్ నాగరాజు, టి. రఫీ, బాబు రాయుడు, నూర్బాష, అన్సార్, ఎ.వి. సుబ్బారెడ్డి, పి. రెహ్మాన్, పి. శ్రీనివాసులురెడ్డి, పి. సుబ్బరాయుడు, సిహెచ్. రవికాంత్ రెడ్డి, ఆర్.వి. శేషు సంఘీభావం ప్రకటించిన వారిలో ఉన్నారు. షర్మిల పాదయాత్ర చేస్తున్న వజ్రకరూరు మండలంలోని పందికుంట గ్రామ సమీపానికి వెళ్ళి ఆమెను కలిశారు. మద్దతు పలకడానికి కువైట్ నుంచి వచ్చామని తెలిపారు. పాదయాత్ర జయప్రదం కావాలని ఆంకాంక్షిస్తూ ఆమెకు జ్ఙాపికను అందచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ కూడా వారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.

Back to Top