ఫ్యాన్ గుర్తుకే మన ఓటు

ఖమ్మం: కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపిస్తే.. ఖమ్మంకు ఐటీ కారిడార్ను తీసుకొస్తామని, పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఖమ్మంలో వైఎస్ఆర్ సీసీ బలంగా ఉండటం మూలంగానే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ నేతలు  డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి స్లిప్పులను పంపిణీ చేస్తూ ఓటర్లకు ప్రలోభపెడుతున్నారని పొంగులేటి విమర్శించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

Back to Top