వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

  • వైయస్సార్సీపీలోకి మాజీ మంత్రి
  • వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన మోహన్ రావు
హైద‌రాబాద్‌: తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన‌ మాజీ మంత్రి, పిఠాపురం కాంగ్రెస్ నాయ‌కుడు కేవీసీహెచ్ మోహ‌న్‌రావు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ఆయ‌న వైయ‌స్ఆర్‌సీపీలో చేర‌గా, మోహ‌న్‌రావుకు వైయ‌స్ జ‌గ‌న్ కండువా క‌ప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. మోహన్ రావుతో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు వైయస్సార్సీపీలో చేరారు.  మోహ‌న్‌రావు స్వ‌ర్గీయ కోట్ల విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి హ‌యాంలో అట‌వీ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 

 వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలన్నదే తన లక్ష్యమని మాజీ మంత్రి కొప్పన మోహన్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఆయన కుమారుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నెరవేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నాయకుడు చేయని పోరాటాలు వైయస్‌ జగన్‌ చేపట్టారని తెలిపారు. ఆయన పోరాట పటిమకు ఆకర్శితుడనై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ధృక్పథం నాకు ఉందన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీని బలోపేతం చేసి, అక్కడ పార్టీ ఎవరిని నిలబెట్టిన అభ్యర్థి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.


Back to Top