ఓట‌మి భ‌యంతోనే జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు


* బాబు మోసాల‌ను ప్ర‌జ‌లు తెలుసుకుంటున్నారు
* స‌రైన స‌మ‌యంలో గుణ‌పాఠం చెబుతారు
* వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ పీఆర్కే
గుంటూరు: న‌ంద్యాల‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌ని భ‌యంతోనే టీడీపీ నేత‌లు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్‌జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ పిన్నెళ్లి రామ‌కృష్ణారెడ్డి అన్నారు.  మూడు సంవత్సరాలుగా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిత్యం ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలను అనైతికంగా పార్టీలోకి చేర్చుకుని  రోజు కొక మాట మార్చి మాట్లాడే మీకు జగన్‌ను విమర్శించే స్ధాయి మీకు ఎక్కడదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ  మెజారిటీ తమవైపు ఉందనే ధీమాతో శాసనసభలో ఒక్క సమస్యను కూడా ప్రస్ధావించకుండా ప్రతిపక్షాన్ని అడ్డగించి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని అనేక సార్లు అవమానించి, నిందలు మోపి రౌడి, గూండా, ఫ్యాక్షనిస్టు అనే ఆరోపణలతో దౌర్జన్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.  ప్రత్యేక హోదా నుండి రాష్ట్రంలోని ప్రతి సమస్య గురించి స్పందించే జగన్‌ను చూసి భయపడుతూ నంద్యాల ఉప ఎన్నికలలో శిల్పా మోహన్‌రెడ్డి విజయం ఖాయమని గురువారం సభ జరగటం, లక్షలాది మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభిమానులు  ఓటర్లు తరలిరావటంతో బెంబేలెత్తిన టిడిపి నాయకులు మోసపూరితంగా వ్యవహరించిన సిఎం చంద్రబాబు గురించి జగన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. నిజంగా దమ్ముంటే నంద్యాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు తిరగకుండా అభివృద్ధి నమ్మి తమ పార్టీ అభ్యర్ధి గెలుస్తాడని  వ్య‌వ‌హ‌రించాల‌ని స‌వాల్ విసిరారు.

తాజా ఫోటోలు

Back to Top