ప్రతిపక్షం లక్ష్యం ప్రజాభివృద్ధి

తిరుపతి: ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాభివృద్ధి కోసం అనేక రకాలుగా అహర్నిశలు కష్టపడుతున్నానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి ఎంపీ వరప్రసాదరావు అన్నారు. అధికార పార్టీ ఎంపీలు కూడా తిరుగనంతగా మూడున్నర సంవత్సరాల కాలంలో దాదాపు 1300 గ్రామాల్లో పర్యటించానని ఆయన చెప్పారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో తనకు 87 నుంచి 89 శాతం హాజరు ఉందన్నారు. దాదాపు 90 సార్లు పార్లమెంట్‌లో మాట్లాడనని చెప్పారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేశానని వివరించారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 90 మందికి రూ. 1.5 కోట్ల మేర నిధులు మంజూరు చేయించానన్నారు. ఏర్పేడు ఇసుక మాఫియా ఘటనలో 17 మంది అమాయకులు చనిపోతే వెంటనే లేఖ రాసి రూ.40 లక్షలు మంజూరు చేయించానన్నారు.

Back to Top