జగనన్న వస్తేనే జాబులొస్తాయి


విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు వస్తాయని నర్సింగ్‌ విద్యార్థులు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం ధర్మసాగరం క్రాస్‌ వద్ద నర్సీంగ్‌ విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని వాపోయారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి..తన కొడుకుకు మాత్రమే దొడ్డిదారిని మంత్రి ఉద్యోగం కట్టబెట్టారని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, అలాంటి  హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. హోదా కోసం పోరాటం చేస్తున్నజగన్‌ ముఖ్యమంత్రి అయితే ఉద్యోగాలు వస్తాయని నర్సీంగ్‌ విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకోసం జగనన్నకు అండగా ఉంటామని, వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తెచ్చుకుంటామని వారు పేర్కొన్నారు.

 
Back to Top