ప్రవాసాంధ్రులు ఓటు నమోదు చేసుకోవాలని అభ్యర్థన

వైయస్ఆర్ కడప: 2013 లో డిగ్రీ పూర్తి చేసుకున్న గల్ఫ్ ప్రవాసాంధ్రుల కుటుంబ సభ్యులు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల  ఓటు  నమోదు చేసుకోవాలని వైయస్సార్సీపీ కోరింది. స్ధానిక పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశములో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్ . మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయములో ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం లేదంటే 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం,  ప్రవాసాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తాం. అక్కడ బాధితులను ఆదుకుంటాము అని చెప్పిన చంద్రబాబు ....ముఖ్యమంత్రి అయినా తర్వాత  హామీలకు మంగళం పాడారని ఫైర్ అయ్యారు. 

గల్ఫ్ బాధితులను మోసం చేసిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే  పట్ట భద్రులు ఓటరుగా నమోదు చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థుల విజయానికి  కృషి చేయాలని అభ్యర్ధించారు. ఈ సమావేశములో ఎన్ .ఆర్ . ఐ లు షేక్ అన్సార్, జి.ఎస్. బాబురాయుడు, మహ్మద్ గౌస్ ( బాబు ) షేక్ గయస్, అబ్దుల్ రౌఫ్, పాల్గొన్నారు.
Back to Top