నామినేషన్ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి

హైదరాబాద్ః  వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీ చేరుకున్న ఆయన మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలపై పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, గిడ్డి ఈశ్వరి, ముత్యాలనాయుడు సంతకాలు చేశారు.  ఈనెల 31తో నామినేషన్ గడువు ముగియనుండగా...వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.

Back to Top