నగరి: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చేసిన ప్రచారమంతా జగన్‌గారిని రాజకీయంగా ఎదుర్కొలేక బురద జల్లడం కోసం చేసిన తప్పుడు ప్రచారమేనని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్‌షీట్ ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తమ రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది హిందువులు ఆరాధించే తిరుమల శ్రీనివాసుడి మీదనే నిందలు మోపారని స్పష్టమైందని, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని ఆమె మండిపడ్డారు. నిజాయితీగా విచారణకు నిలబడి తప్పులేదని నిరూపించుకున్న వైయస్ జగన్ గారి కాళ్లు కడిగి ఆ నీళ్లను చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు తన తలపై చల్లుకోవాలని సూచించారు. వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో మీటింగ్ పెట్టి అబద్ధాలు ప్రచారం చేసిన పవన్‌కళ్యాణ్‌కు తగిన శాస్తి జరిగిందని ఆర్కే రోజా అన్నారు. అబద్ధాలు మోసాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీడీపీ, జనసేన పార్టీలను భూస్థాపితం చేయాలని నగరిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి ఆర్‌కె రోజా పిలుపునిచ్చారు. ప్రెస్‌మీట్‌లో ఆర్‌కె రోజా ఇంకా ఏం మాట్లాడారంటే..: సీబీఐ చార్జిషీట్ తర్వాత కూడా దిగజారుతూనే ఉన్నారు : తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ అండ్ కో చేసిన ప్రచారమంతా అబద్దమని తేలిపోయింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని, సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఛార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. దీంతో రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతాడని మరోసారి రుజువైంది. కాగా, ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేసి మరీ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా, సీబీఐ సిట్ ఛార్జిషీట్ ద్వారా జగన్‌గారి నిజాయితీ రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థమైంది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయినప్పటికీ. జగన్‌గారి వ్యక్తిత్వ హననం చేయడం, ఆయన మీద బురదజల్లే కుట్రతో టీడీపీ–జనసేన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తాము ఇన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న అబద్ధాన్ని ఇంకా నిజమని నమ్మించే కుట్రల్లోనే ఉన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం తిరుమల శ్రీనివాసుడి మీదనే తప్పుడు ప్రచారానికి దిగడానికి కూడా వెనుకాడటం లేదంటే వీరికి దేవుడంటే భయం భక్తి ఉందని ఎలా అనుకోవాలి? రాష్ట్రపతి తక్షణం స్పందించి తిరుమలపై తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలి. పవన్‌కళ్యాణ్ ఏం ప్రాయశ్చిత్తం చేస్తాడు?: చంద్రబాబు ఏ గెటప్ వేయమని చెబితే ఆ గెటప్ వేసుకుని మాట్లాడే డ్రామా ఆర్టిస్ట్ పవన్‌కళ్యాణ్. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం సనాతన ధర్మం ముసుగులో నాటకాలు ఆడే డ్రామా ఆర్టిస్టుల గురించి ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయి. తిరుమల లడ్డూ కల్లీ అయ్యిందని చంద్రబాబు అబద్ధం చెబితే షూటింగ్‌లు పక్కన పెట్టేసి విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మెట్లు కింద నుంచి పైకి కడిగిన పవన్ కళ్యాణ్.. వారు చెప్పినవన్నీ అబద్దాలేనని తేలిపొయాయి కాబట్టి దానికి ఏం ప్రాయశ్చిత్తం చేసుకుంటారో చెప్పాలి. వైయస్ జగన్ గారిని టార్గెట్ చేసి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా చేసిన కుట్ర బయటపడింది కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇప్పుడు ఆయన కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. ఆయన తప్పు చేయలేదని న్యాయస్థానాల ద్వారా నిరూపించుకున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించినందుకు భక్తుల కాళ్లు కడగాలి. తిరుమల ప్రతిష్టను మంట గలిపేశారు: వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ ఊగిపోతే.. ఆరోజు ఆయన పక్కనే ఉన్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరింత ఊగిపోయాడు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన వీరంతా దేవుడు చాచిపెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి కింద పడ్డారు. ఆడవాళ్లకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని అబార్షన్లు చేయించి వారి జీవితాలనను నాశనం చేసే వారు జగన్‌గారి గురించి మాట్లాడేవారా? వారి నోళ్లను ఫినాయిల్‌తో కడిగినా వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ నిజంగా హిందువులైతే, వారు హిందూ ధర్మాన్ని ఆచరించే వారే అయితే, తక్షణం రాజీనామా చేయాలి. తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా చేసిన తప్పుడు ప్రచారానికి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. సుప్రీంకోర్టు కూడా వీరి మీద సుమోటోగా కేసు నమోదు చేయకపోతే ఇంకా చాలా మంది తమ రాజకీయ లబ్ధికోసం శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటారు. వైయస్ జగన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి చేయని కుట్రలు లేవు. అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి ఒక సంప్రోక్షణ, హోమాలు చేశారు. ఒకరు రైల్లో భజన చేసుకుంటూ తిరుమల వచ్చారు. తిరుమల కొండపైన మహాశాంతి హోమం చేసిన ఆ వ్యక్తి భక్తులకు ఏం సమాధానం చెబుతారు? డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత దిగజారాలా?: విజయవాడ వరద సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారు. ఏపీలో గెలిచి ఆంధ్రప్రదేశ్‌కి టూరిస్టులుగా ఉన్న ఈ నాయకులంతా ఆ వరదల సమయంలో ప్రజలను గాలికొదిలేశారు. వీళ్ల చేతకానితనానికి విజయవాడ మునిగిపోతే దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చేయకూడని పాపం చేశారు. దేవుణ్ని కించపరిచేలా వ్యవహరించిన టీడీపీ, జనసేనను ప్రధాని మోడీ కూటమి నుంచి బయటకు గెంటాలి. లేదంటే ప్రజలు ఆయన్ను కూడా అనుమానిస్తారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ను తరిమి కొట్టాలి: పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి ఆయన్ను స్త్రీ లోలుడిగా చిత్రీకరించి ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న చంద్రబాబు.. రాజకీయం కోసం ఎంతకైనా దిగజారిపోతాడని మరోసారి తేలిపోయింది. చంద్రబాబు లాంటి దరిద్రమైన నాయకుడు దేశంలో ఎవరూ ఉండరని రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. చంద్రబాబు లాంటి వారు రాజకీయాల్లో ఉంటే రాష్ట్రం భ్రష్టుపట్టిపోతుంది. తప్పుడు మాటలు, అబద్ధపు హామీలతో ప్రజలను రెండేళ్లుగా వంచిస్తున్న టీటీడీ, జనసేన పార్టీలను ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయం. నేపాల్ ఎలా అయితే పాలకులను తరిమి తరిమి కొట్టారో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ను కూడా అలాగే రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని మాజీ మంత్రి ఆర్‌కె రోజా పిలుపునిచ్చారు.