పంచాయ‌తీరాజ్‌ విభాగం డైరీలు ఆవిష్కరించిన వైయస్ జగన్

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంద‌ని భరోసా

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ పంచాయ‌తీరాజ్‌ విభాగం 2026 నూతన సంవత్సర డైరీలను మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవడానికి పంచాయ‌తీరాజ్‌ విభాగం మరింత క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల హక్కులు, గౌరవాన్ని కాపాడేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరిస్తోందని విమర్శించిన వైయస్ జగన్, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే దూరం చేసే విధానాలను పార్టీ శక్తివంచన లేకుండా ప్రతిఘటిస్తుందని స్పష్టం చేశారు. పంచాయితీరాజ్‌ ప్రతినిధులు ప్రజల తరఫున ధైర్యంగా నిలబడాలని, పార్టీ వారికి పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైయ‌స్ఆర్‌సీపీ పీఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వీరయ్య, పీఆర్‌యూ నాయకులు ఫిరోజ్‌, కిరణ్‌కుమార్‌, చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Back to Top