పేదలను బెదిరించి భూములు కొల్లగొట్టారునితీపరుడ్ని అని చెప్పుకోవడం కాదు బాబు నిరూపించుకోపేదల ఆస్తులు కొల్లగొడుతున్న నీలాంటి..ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరురైతుల దగ్గర తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలిభూదందాపై న్యాయవిచారణ జరిపించాలిః బొత్స
హైదరాబాద్ః వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భూకుంభకోణాలు చేసి రెడ్ హ్యాండెండ్ గా దొరికిపోయి కూడా మంత్రులను వెనకేసుకొస్తూ ..చంద్రబాబు తేలు కుట్టిన దొంగలాగ మాట్లాడుతున్నాడని బొత్స మండిపడ్డారు. మాట్లాడితే నిజాయితీ పరుడినని చెప్పుకునే చంద్రబాబు..వచ్చిన ఆరోపణలపై నిజాయితీ నిరూపించుకోకుండా భూములు కొంటే తప్పేంటి అని మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు.
రాజధాని భూ దోపిడీపై ఆధారాలతో సహా బయటకువస్తే దానికి, సమాధానం చెప్పకుండా.. పైపెచ్చు వ్యాపారాలు చేసుకుంటే తప్పా, ఢిల్లీనుంచి సీబీఐని పిలిపించాలా అంటూ చంద్రబాబు అమానుషంగా మాట్లాడుతున్నారని బొత్స ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడు మీరు ఎన్టీఆర్ అల్లుడో, నారా లోకేశో తండ్రో కాదు... రాష్ట్ర ముఖ్యమంత్రివన్న సంగతి మరవద్దన్నారు. సీఎంగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు. నంగనాచి లాగ నేను ఏది చెబితే అది చెల్లుతుందనుకుంటే పొరపాటు చంద్రబాబు. ఆరోజులు ఎప్పుడో పోయాయని బొత్స అన్నారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పేదల ఆస్తులను కొల్లగొడుతున్న చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేడని బొత్స దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రభుత్వపరంగా ఏం చర్యలు తీసుకుంటారని బాబును ప్రశ్నించారు. రాజధాని కడతానని రైతులను బెదిరించి మీ తాబేదార్లుకు, మంత్రులకు భూములు ఇప్పించుకున్నారు. ఆ భూముల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయిలు లూటీకి పాల్పడ్డారు. దాని గురించి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. సీబీఐ విచారణ జరిపి న్యాయం జరగేలా చూడాలని కోరుతున్నామన్నారు.
రాజధాని ప్రాంతంలో భూ దందా వాస్తవం అవునా?...కాదా?. రాజధాని ప్రకటనకు 3 నెలలకు ముందే ఎలా భూములు కొన్నారు. అనంతపురం నుంచో నెల్లూరు నుంచో వెళ్లి రాజధాని ప్రాతంలో భూములు కొంటున్న వ్యక్తులు.. 13 జిల్లాల్లో ఎక్కడా కొనకుండా అక్కడే ఎందుకు కొనాల్సి వచ్చింది. అమాయక రైతులను భయపెట్టి భూములు లాక్కున్నారు. చంద్రబాబు మీ ద్వంద్వ వైఖరి. డొల్లతనం బయటపడింది. అందుకే సూటిగా ప్రశ్నిస్తున్నాం. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు పనైపోయిందని బొత్స ఎత్తిపొడిచారు.
బాబు మాట్లాడితే నీతివండుడ్ని అంటావే..? భూముల లూటీపై న్యాయవిచారణకు మీరు సిద్ధమైనా? అసైన్డ్ భూములు కొనడం చట్ట విరుద్ధమని మీకు తెలియదా?. మీ ఆస్తుల ప్రకటన వెనుక ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మీ ఆస్తులు, మీ బినామీల గురించి అన్ని బయటకు వస్తున్నాయి. ఒక మంత్రి తన భార్య పేరు మీద భూములు కొనడం మరీ తప్పు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు మీ పనయిపోయింది. భూ లూటీ వెనక వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాలి'....అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
బాబు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ,నిజాయితీ ఉన్నా..నీవు నిర్మించేది నిజంగా ప్రజా రాజధాని అయితే భూములను తిరిగి వారికిచ్చేయాలి. దానిపై వచ్చిన ధన ప్రతిపలాన్నిరైతులకు ఇవ్వాలి. అప్పుడు మీ వ్యవహారం బయటపడతుంది. శివరామకృష్ణమన్ కమిటీని కాదని నారాయణతో కమిటీ వేశారు. రాత్రిపూట మాట్లాడుకొని మీ బినామీల పేర భూములు దోచుకున్నారు. గతంలో 3 అంగులాలకే నానా రభస చేసిన నీవు 30 వేల ఎకరాలు దోచుకుంటున్నావే. దీనిపై ఏం సమాధానం చెబుతావని బాబును ప్రశ్నించారు. పంచభూతాల్ని దోచేస్తున్నారు. ఎంతసేపు ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.