వైయస్‌ జగన్‌కు భద్రత కరువు

 


– నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు
–  నరసరావుపేటలో తొక్కిసలాట జరిగే అవకాశం
– పోలీసులకు ఫిర్యాదు చేసిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు

గుంటూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే వైయస్‌ జగన్‌కు భద్రత కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం వైయస్‌జగన్‌ పాదయాత్ర గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని అడుగుపెట్టింది. సాయంత్రం నరసరావుపేట పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రోప్‌ పార్టీ మినహా మరెక్కడా పోలీసులు కనిపించడం లేదు. వైయస్‌ జగన్‌కు జెడ్‌ కేటగిరి ఉన్నా అధికారులు భద్రత కల్పించడం లేదు. వైయస్‌ జగన్‌ను కలిసేందుకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. భద్రత కల్పించాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. 
 
Back to Top