వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు

చిత్తూరు(పుంగనూరు))ఇటీవల బాబు అవినీతి సొమ్ముకు ఆశపడి వైయస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డికి సొంత గ్రామస్తులు షాక్ ఇచ్చారు. టీడీపీ అనైతిక విధానాలు నచ్చక తెలుగుతమ్ముళ్లు ఆపార్టీకి గుడ్ బై చెప్పేశారు. పెద్దపంజాణి మండలానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వందమందికి పైగా వైయస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా వారందరికి పెద్దిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Back to Top