అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే స‌హించేది లేదు


 నెల్లూరు : రాజకీయ కక్షతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను  అప్రతిష్ట పాలు చేయాలనుకుంటే సహించేది లేదని నెల్లూరు రూరల్ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి హెచ్చ‌రించారు.  ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్రికెట్ బుకీలకు మద్దతుగా పోలీసులకు తాను ఫోన్ చేసివుంటే వాటి వివరాలు బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తాను ఎవరికి ఫోన్ చేశానో ఆ అధికారుల పేర్లు ఎందుకు ఎస్పీ బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కొందరు బుకీలు మంత్రులకు సన్మానాలు చేశారని, అలాగే ఫ్లెక్సీలు కూడా కట్టారని, దీనిపై ఎందుకు విచారణ చేయడం లేదని సూటిగా అడిగారు. కృష్ణ సింగ్ అనే బుకీతో తాను విజయవాడలోని ఓ హోటల్, కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఉన్నట్లు చెబుతున్నారని, అలా ఉంటే సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టాలని అడిగారు. ఒకవేళ తాను ఉన్నట్లు నిరూపిస్తే గంటలో నా పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి సవాల్‌ విసిరారు. 

Back to Top