నెల్లికుదురులో 200 మంది పార్టీలో చేరిక

నెల్లికుదురు(వరంగల్) 19 మే 2013:

వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నేత జన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, కర్ణావతు రాధావెంకన్ననాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలంటే..శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని పలువురు నేతలు  చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top