అన్నదాతను కించపర్చిన చంద్రబాబు

వెలగపూడి: రైతులు మత్తు పదార్థాలు వాడి ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం సభలో వ్యాఖ్యానించడం అన్నదాతను కించపర్చడమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ ఎత్తిచూపిస్తుంటే తట్టుకోలేక మాపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మాట్లాడుతుంటే మాటిమాటికి మైక్‌ కట్‌ చేయడం భావ్యం కాదని హితవుపలికారు. ప్రతిపక్ష లెక్కలను ఓర్వలేక చంద్రబాబు సర్కార్‌ దివంగత నేత వైయస్‌ఆర్‌ పరిపాలనపై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత వైయస్‌ఆర్‌దని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పుడు వాగ్దానాలు నమ్మిమోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతీ రైతు కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శిస్తున్నారని, వైయస్‌ఆర్‌ పాలన మళ్లీ వస్తోందని వారికి అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారన్నారు. 

Back to Top