‘నారాయణ’ను ఏపీలో బ్యాన్‌ చేయాలి

విజయవాడ: ప్రశ్నపత్రాలు లీక్‌ చేసిన నారాయణ విద్యాసంస్థలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బ్యాన్‌ చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. మాస్‌కాపింగ్‌కు పాల్పడిన విద్యార్థిని 3 సంవత్సరాలు డిబార్‌ చేసే ప్రభుత్వం.. లీక్‌లకు కారణం అయిన నారాయణ సంస్థలను 5 సంవత్సరం పాటు ఏపీ నుంచి బహిష్కరించాలని మండిపడ్డారు. ఢిల్లీలో కూర్చొని జస్ట్‌ అది వాట్సప్‌ ద్వారా లీక్‌ అయ్యింది అటెండర్‌ లీక్‌ చేశారని మంత్రి గంటా చెప్పడం సిగ్గుచేటన్నారు. నారాయణ విద్యా సంస్థల్లోని అటెండర్‌కు పేపర్‌ లీక్‌ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఒకపక్క మంత్రి నారాయణ ఎగ్జామ్‌ తరువాత లీక్‌ అయ్యిందంటున్నారు. మరో పక్క గంటానేమో అటెండర్‌ లీక్‌ చేశారని పొంతనలేని సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. లీక్‌లపై చర్చకు పట్టుబడితే ఎల్లుండి వస్తాం.. స్టేట్‌మెంట్‌ ఇస్తాం అంటూ సభను వాయిదా వేసుకొని తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడితే దొంగలు దొరికిపోతారని పరీక్షలు అయిపోయిన తరువాత స్టేట్‌మెంట్‌ ఇస్తారంట. ఇంకా నయం రిజల్ట్స్‌ వచ్చాక ఇస్తామంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

Back to Top