నేడు వైయస్‌ఆర్ సీపీ రక్తదాన శిబిరాలు

హైదరాబాద్, 1 అక్టోబర్ 2012: జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా సోమవారంనాడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ నారాయణగూడలోని వైఎంసీఏ గ్రౌండ్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.‌  ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
నారాయణగూడలో నిర్వహించే రక్తదాన శిబిరంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై‌యస్ విజయమ్మ పాల్గొంటారు. రక్తదాన శిబిరానికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు.  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ‌శివభార‌త్‌రెడ్డి, 'రైజ్‌ యువర్‌ వాయిస్'‌ లాంటి పలు ఎన్‌జిఓ సంస్థలు, డాక్టర్‌ దుత్తా శాంతివర్ధన్‌ ట్రస్టు, వైయస్‌ఆర్‌ ఫ్రెండ్సు, ఫ్యాన్సు అసోసియేషన్‌ ఈ శిబిరం నిర్వహణలో పాలు పంచుకుంటున్నాయి.
Back to Top