7న నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలి

అనంత‌పురం: రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈనెల 7న నియోజకవర్గ కేంద్రమైన మడకశిరలో జరిగే నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మడ‌క‌శిర నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త తిప్పేస్వామి పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పిలుపుమేర‌కు ఐదు మండలాలకు చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుంబంధ సంఘాల సభ్యులు 7వ తేదీ ఉదయం 10గంటలకు మడకశిరకు తరలిరావాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్‌ సర్కిల్‌ నుండి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచి పార్టీ ఫిరాయించిన 21 మందిలో నలుగురు సభ్యుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోకి తీసుకున్న అనైతిక, అప్రజాస్వామిక చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు.  

Back to Top