చంద్ర‌బాబుకి ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు-ఎంపీ మేక‌పాటి

న్యూఢిల్లీ) అడ్డ‌గోలుగా ఎమ్మెల్యేల‌ను లాక్కొనేందుకు చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న ప్ర‌లోభాల మీద వైఎస్సార్సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయాల‌నే ఆలోచన పక్కకు పెట్టి ఫిరాయింపుల మీద‌నే సీఎం చంద్ర‌బాబు, మంత్రులు దృష్టి పెడుతున్నార‌ని ఆయ‌న‌ అన్నారు. పార్ల‌మెంటు లో వైఎస్సార్సీపీ త‌ర‌పున అఖిల ప‌క్ష స‌మావేశానికి హాజ‌రు అయిన మేక‌పాటి...న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి మార్పులు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందని, ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. సొంతపనులు చక్కబెట్టుకునేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళుతున్నారని అన్నారు. తమ పార్టీ బీఫాంపై గెలిచి వేరే పార్టీలోకి వెళుతున్నారని అన్నారు.  చంద్రబాబు చర్యల మూలంగా టీడీపీ దిగజారీ పోతుందని చెప్పారు. అసలు చంద్రబాబుకు నైతిక విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. చంద్రబాబు తీరుపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్యర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
Back to Top