వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

గుంటూరు: ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన  పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రజాసంకల్పయాత్ర క్యాంపులో కొద్ది సేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. ఎంపిలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోనహ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వరప్రసాసాద్, మిధున్ రెడ్డి ,అవినాశ్ రెడ్డి ,అవినాష్ రెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  
ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ఆర్ సీపీ తరపున చేస్తున్న ఆందోళనలు, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు,  అవిశ్వాస తీర్మానం పై చర్చకు పట్టుబట్టడం వంటి వాటితో పాటు ముందు ప్రకటించిన రాజీనామాల అంశాలపై ఈసమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణను రూపొందించనున్నారు. 

Back to Top