అణచివేత, బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మాజీ మంత్రి, వైయస్సార్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజలను ఆకాంక్షను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, ప్రపంచంలో ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదని వాపోయారు. దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉధృతమవుతుందని ధర్మాన హెచ్చరించారు.

అణచివేత, బెదిరింపులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి బాలరాజు అన్నారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు ప్రత్యేక హోదా కావాలంటున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించాలని కోరారు.

Back to Top