వైయస్సార్‌ వర్థంతి వేడుకలకు తరలిరండి

వజ్రకరూరు: మండల కేంద్రం వజ్రకరూరులో సెప్టెంబర్‌ 2వతేదీ శనివారం జరిగే దివంగత ముఖ్య మంత్రి వైయస్సార్‌ వర్థింతి వేడుకలకు మండలంలోని పార్టీనాయకులు, కార్యకర్తలు పె ద్ద సంఖ్యలో తరలి రావాలని వైయస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు జయేంద్రరెడ్డి, వజ్రకరూరు గ్రామకమిటి అధ్యక్షుడు రాకెట్లబాబు పిలుపునిచ్చారు.శుక్రవారం సాయంత్రం వజ్రకరూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... వైయస్సార్‌ వర్థంతిని పురస్కరించుకుని స్థానిక వైయస్సార్‌ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వైయస్స ర్‌ ప్రజలకు చేసిన సేవలను వివరించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్ర మానికి మండలంలోని వైయస్సార్‌సీపీసర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపి,జడ్పిటిసి, వైస్‌ఎంపిపి లతోపాటు పార్టీనాయకులు,కార్యకర్తలు తరలిరావాలని వారు కోరారు .శనివారం ఉదయం 10గంటలకు వజ్రకరూరులోని వైయస్సార్‌ విగ్రహం వద్దకు చేరు కోవాలని వారు కోరారు.


బుక్కపట్నంః దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలలో వైయస్సార్‌సీపీ శ్రేణులు విరివిగా పాల్గొనాలని ఆ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి మండలంలోను వర్ధంతి కార్యక్రమాలు నిర్వహింంచి మహానేతకు  నివాళులు అర్పించాలని సూచించారు. నల్లమాడ,ఓడీచెరువు,బుక్కపట్నం,కొత్తచెరువు మండల కేంద్రాలలో జరిగే కార్యక్రమాలకు స్వయంగా తాను హాజరవుతున్నట్లు శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

అమరాపురం :స్థానిక వైయస్సార్‌సర్కిల్‌లో శనివారం ఉదయం నిర్వహించే దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతికి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని జిల్లా వైయస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి వాగేష్, మండల కన్వీనర్‌ సత్యానారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని నాయకులు, కార్యకర్తలు, వైయస్సార్‌ అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని వారువిజ్ఞప్తి చేశారు.

చిలమత్తూరు: దివంగత ముఖ్యమంత్రి, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలిరావాలని వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఎం.సదాశివారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు చిలమత్తూరులోని వైయస్సార్‌ విగ్రహం వద్దకు అభిమానులు, వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్‌ లెవెల్‌ కమిటీ నాయకులు, సభ్యులు తరలిరావాలని ఆయన కోరారు.

కూడేరుః కూడేరులో శనివారం మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి 8వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వైయస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌ శుక్రవారం తెలిపారు. వర్ధంతి వేడుకలకు మండలంలోని వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

కంబదూరు:దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 8వ వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని వైయస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గుద్దెళ్ల నాగరాజు పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం జరగనున్న వైయస్సార్‌ వర్ధంతి కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించాలన్నారు. వైయస్సార్‌ విగ్రహాలు ఉన్న చోట ఉదయమే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలన్నారు. అలాగే మండల కేంద్రంలో జరిగే కార్యక్రమానికి కూడ మండలంలోని వైయస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

రాప్తాడు : నియోజకవర్గ వ్యాప్తంగా మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ వర్థంతి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మండల కన్వీనర్‌ బోయ రామాంజినేయులు, యూత్‌ మండల కన్వీనర్‌ చిట్రేడ్డి సత్యనారాయణరెడ్డి తెలిపారు. అంతే కాకుండా వైయస్సార్‌ అభిమానులు కూడా ఈ వర్థంతి కార్యక్రమాలను పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. 

మడకశిర : నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకు వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. వైయస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో తొలుత ఉదయం 9గంటలకు మడకశిరలోని వైయస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామని వైయస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. అంతే కాకుండా ఆస్పత్రుల్లోని రోగులకు పాలు,బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆ తర్వాత అగళి, రొళ్ల, గుడిబండ, అమరాపురంలో జరిగే వర్ధంతి కార్యక్రమాల్లో కూడా సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి పాల్గొననున్నారు. ఈ వర్ధంతి కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఊరూరా ఈ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడానికి ఆయా గ్రామాల వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


Back to Top