వైయ‌స్ జగన్ రైతు దీక్షకు తరలిరండి

పెనమలూరుః వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌. జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మద్దతుగా చేప‌డుతున్న‌ రైతు దీక్షకు పార్టీ నాయ‌కులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం పార్టీ నేతలు విలేకరులతో మాట్లాడారు. గుంటూరులో మే 1, 2 తేదీల్లో రైతులకు మద్దతుగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేయనున్నారన్నారు. మిర్చి, పత్తి, పసుపు, వరి ఇతర పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చే విషయంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని నేతలు మండిప‌డ్డారు. రైతులకు న్యాయం చేయటానికి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావటానికి ఈ దీక్ష చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి కొఠారి శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు మరీదు శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గద్దలరాజేంద్ర, జిల్లా క్యార్యదర్శి చాంద్‌బాషా, వల్లేనరసింహారావు, పలువురు పాల్గొన్నారు.

Back to Top