హైదరాబాద్, 31 ఆగస్టు 2012: రాష్ట్ర మంత్రి వర్గం, రెండు నెలల తరువాత శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను చర్చించి ఆమోదముద్ర వేయనుందని సమాచారం. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది.ఈ సమావేశానికి ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు. ఈయన రాజీనామా అంశంపై వాడివేడి చర్చ సాగిందని సమాచారం.