సంక్షేమ పథకాలను నీరుగారుస్తున్నారు

శ్రీకాకుళంః పేదల సంక్షేమ పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో అన్నివర్గాల ప్రజలను చంద్రబాబు నాయుడు నట్టేట ముంచాడని మండిపడ్డారు. జన్మభూమి కమిటీలు పేరుతో దోచుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాలను పూర్తిగా నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండ నియోజకవర్గంలో జరిగిన సభకు ప్రజలు భారీసంఖ్యలో వచ్చి వైయస్‌ జగన్‌కు మేమందరం అండగా ఉన్నామని చాటిచెప్పారని, మహిళలు కూడా జననేతకు పెద్దఎత్తున్న బ్రహ్మరథం పడుతున్నారన్నారు.సంక్షేమ పథకాలు నేరుగా ప్రతిఒక్క లబ్ధిదారుని చెందాలన్న ఆశయంతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు.జననేతను అంతమొందించడానికి టీడీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైయస్‌ జగన్‌ వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని పూర్తి విశ్వాసంతో అడుగులు వేస్తున్నారన్నారు. నేడు నాగావళి బ్రిడ్జి మీదగా రాజాం నియోజకవర్గంలోని ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించనుందని తెలిపారు.
Back to Top