ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి 2వ రోజు పాదయాత్ర ప్రారంభం

 వైయ‌స్ఆర్ జిల్లా: గండికోట ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర రెండో రోజు ప్రారంభ‌మైంది. ఈ నెల 15వ తేదీ సర్వరాయసాగర్‌ నుంచి ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి పాద‌యాత్ర చేప‌ట్ట‌గా ఆయ‌న‌కు  వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబులు సంఘీభావం తెలిపారు. రేప‌టితో ఆయ‌న పాద‌యాత్ర ముగుస్తుంది. ఈలోగా ప్ర‌భుత్వం స్పందించి స‌ర్వారాయ‌సాగ‌ర్‌కు నీటిని విడుద‌ల చేయ‌క‌పోతే ఉద్య‌మం ఉధృతం చేస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 
 mla ravindranathreddypadayatraSarvarayasagar ProjectGandikota project

Back to Top