రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే రక్షణ నిధి

విజయవాడ: నకిలీ విత్తనాలతో నష్టపోయి ఆత్మహత్యాయత్నం చేసుకుని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రక్షణ నిధి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. నకిలీ విత్తనాలను తయారు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విత్తన సంస్థ నుంచి రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం, పోలీసుల నిరంకుశ చర్యలు దారుణమన్నారు. రైతులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. 
Back to Top