హైదరాబాద్) పార్టీ మారే ప్రసక్తి లేదని, చివరి దాకా వైఎస్సార్సీపీ లోనే ఉంటానని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే అయ్యానంటే అది వైఎస్ జగనన్న వల్లే అని, అటువంటప్పుడు తాను పార్టీ ఎలా మారతానని ఆమె సూటిగా ప్రశ్నించారు. సుమారు 20 కోట్ల రూపాయిలు ఇస్తామని తనను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వెల్లడించారు. డబ్బులకు లొంగే మనిషిని కానని ఆమె స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు, ఛానెల్స్ లో అవాస్తవాలు రాస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివరణ అడగకుండా ఎలా తప్పుడు వార్తలు రాస్తారని రాజేశ్వరి ప్రశ్నించారు. వార్తలు రాసేముందు తమను సంప్రదించి వార్తలు రాయాలని ఆమె కోరారు.