మాట మార్చిన చంద్ర‌బాబు

ఢిల్లీ: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చంద్రబాబు ప్రత్యక హోదా కావాలంటూ మాట మార్చారని సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర మండిపడ్డారు. గతంలో తమ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని, కానీ  ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ మాటమార్చారని విమర్శించారు. హోదాపై వైయ‌స్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ఎంపీలు మాత్రం నాటకాలు ఆడుతున్నారని, రాజీనామాలకు వెనుకాడుతున్నారంటూ మండిపడ్డారు.

Back to Top