అగ్ని ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆర్థిక సాయం

నెల్లూరు) నెల్లూరు
కార్పొరేషన్ పరిధిలోని 30వ డివిజన్ లోని గాంధీనగర్ లో అగ్ని ప్రమాదానికి గురైన
కుటుంబాల్ని రూరల్ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
పరామర్శించారు. బియ్యం, దుస్తులు, వస్తు సామాగ్రి, ఆర్థిక సహాయాన్ని అందించారు.
ప్రభుత్వ పరంగా రావాల్సిన సహాయాన్ని అందించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు
తీసుకొన్నారు. అంతకు ముందు 28వ డివిజన్ చంద్రమౌళీ నగర్ లో ఎమ్మెల్యే శ్రీధర్
రెడ్డి ప్రజా బాట నిర్వహించారు. ఎన్నో సంవత్సరాలుగా పూడిపోయిన కాలువ పూడికతీత
పనుల్ని స్వయంగా పర్యవేక్షించారు.

        నగరంలో కొన్ని వేల కుటుంబాలు పక్కా ఇళ్లు
లేక పూరి గుడెసెలలో నివసిస్తూ బాధలు పడుతున్నరని వీరందరికీ ఇళ్లు ఇప్పించేందుకు
ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆయన ఆదేశించారు. ఇందుకోసం అర్జీలు
తీసుకోవటంతో పాటు సక్రమంగా విధి విధానాలు పూర్తి చేయాలని సూచించారు. తీసుకోవాల్సిన
చర్యల్ని ఆశించిన స్థాయిలో తీసుకోవటం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు. అవకతవకలు
జరిగితే మాత్రం సహించేది లేదని కోటంరెడ్డి అన్నారు. 

Back to Top