ఉపకార వేతనాల స్కామ్ పై ఎమ్మెల్యే కళావతి మండిపాటు


శ్రీకాకుళం: కోట్లాది రూపాయల ఉపకార వేతనాలను కాజేసిన పెద్దలను పట్టుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వడ్డంగి, నులకజోడు, చిన్నదిమిలి గ్రామాల్లో ఆమె  పర్యటించారు. ప్రజా సమస్యలు గుర్తించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చాలా కాలం నుంచి జిల్లాలో ఉపకారవేతనాల స్వాహాకు తెరలేచిందన్నారు. దీనిపై సీబీసీఐడీ విచారణ జరపాలని కోరారు. కుంభకోణంతో సంబంధమున్న చాలామంది పెద్దలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్నారు. వారిని బయటకు లాగాలన్నారు. చిరుద్యోగులను బలిచేసి బడాబాబులను వదిలేయడం విచారణ అధికారులకు తగదన్నారు. బ‌డా బాబుల‌కు అధికార తెలుగుదేశం పార్టీ మ‌ద్ద‌తు ఉంద‌ని ఆమె ఆరోపించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top