లష్కర్‌ పనిచేస్తూ ప్రాజెక్టులు కట్టినట్లు బాబు గొప్పలు

కర్నూలు: చంద్రబాబు లష్కర్‌ పని చేస్తూ ప్రాజెక్టులన్నీ తానే కట్టినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జయరాం మండిపడ్డారు. సిద్ధాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వద్ద శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ గంగా హారతి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో పండుగ వాతావరణం నెలకొందన్నారు. సిద్ధాపురం ప్రాజెక్టును చేపట్టిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని స్మరించుకుంటూ మహిళలంతా పెద్ద ఎత్తున బోనాలతో తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ ప్రాజెక్టు చేపడితే.. చంద్రబాబు ట్యాప్‌ తిప్పి తానే చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు. 
Back to Top