బోయలకు వాల్మీకి జగనన్నకర్నూలు: బోయలకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వాల్మీకి లాంటి వ్యక్తి అని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అభివర్ణించారు. ప్రజా సంకల్ప యాత్ర 22వ రోజు ఆలూరు నియోజకవర్గంలోని బిల్లేకల్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గుమ్మనూరు జయరాం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరును ఆయన ఎండగట్టారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎత్తుకెళ్లారని విమర్శించారు. మనమందరం వైయస్‌ జగనన్నకు తోడుగా ఉండి, ముఖ్యమంత్రిగా చేసుకుందామన్నారు. ఆలూరు నియోజకవర్గానికి చంద్రబాబు జింకల పార్క్‌ తెస్తానని చెప్పి కనీసం పిట్టల గూడు కూడా కట్టలేదన్నారు. ప్రాజెక్టులు నిర్మించాలంటే వైయస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి ఇద్దరు కూడా నా సొంత అన్నలాంటి వాళ్లు అన్నారు. మేమంతా ఒక కుటుంబ సభ్యులమని చెప్పారు. టీడీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, జన సునామీలో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయమన్నారు.
 
Back to Top